స్నేహం... ఎన్నెన్నో చిన్న చిన్న అనుభూతుల కలయిక. నేస్తం...కష్టంలో, సుఖంలో, బాధలో, సంతోషంలో మనకి తోడు. ప్రపంచం అంతా మనకి ఎదురుతిరిగినా..మనల్ని వెన్నంటి ఉండే నిజమైన నేస్తం. అలాంటి ఒక మంచి నేస్తమే...ఈ "ప్రియనేస్తం" కూడా..
ప్రతీ మనిషి జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మరెన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. గతంలో పరిస్థితులని ఒకసారి దాటేసాక ఇప్పుడు మళ్లీ గుర్తుతెచ్చుకుంటే..ఓస్..ఇంతేనా..అప్పుడు మాత్రం ఎంత కంగారు పడిపోయాను అనవసరంగా...అనిఅనిపిస్తుంది.ఎవరైనా నాకు ఈ సమస్య ఉంది అని ఏదైనా చెప్తే మనలో చాలామందికి..అంతేనా! అని అనిపిస్తుంటుంది. కాని ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళకి మాత్రం కంగారు ఎక్కువగా ఉంటుంది. వాస్తవం ఏంటంటే సమస్య మనది అయినప్పుడు మనం దానికి మానసికంగా చాలా attach అయి ఉంటాము. అదే బయటి నుండి చూసేవాళ్ళు సమస్యని detatchedగా ఉండి ఆలోచిస్తారు. మన సమస్య అయితే emotional linkage ఉండటం వల్ల మనం strict decisions తీసుకోలేము. అదే వేరే వ్యక్తి అయితే ఏ సంబంధం లేదు కాబట్టి, నిర్మొహమాటంగా వారి అభిప్రాయలు చెప్తారు. ఒకోసారి మనం ఇలాంటి సందేహ స్థితిలో ఉన్నప్పుడు దగ్గర స్నేహితుల్ని సలహా అడిగితే, మనం బాధపడతామని గానీ, అపార్ధం చేసుకుంటామని గానీ, నిర్మొహమాటంగా వారి అభిప్రాయలు చెప్పలేరు. ఎందుకంటే మనం ఏ విషయానికి ఎలా స్పందిస్తామో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. ఒకోసారి మనకి చేయాలనిపించేది మంచి నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే మనసుకి నచ్చినంత మాత్రాన అది సరైన నిర్ణయం అయిపోదు కదా..! ఇక్కడే మనసుకీ, మెదడు కీ, clash వస్తుంది. కానీ..కొన్ని సందర్భాల్లో మనసుకి కష్టంగా ఉన్నా సరైన నిర్ణయం తీసుకోక తప్పదు మన భావి జీవితం కోసం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏ విషయంలోనైనా మన శ్రేయోభిలషులందరినీ సలహాలు అడిగి వాళ్లు చెప్పేవి అన్నీ శ్రద్దగా విని, అన్నీ కోణాల్లో analyse చేసుకుని తుదినిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి. because you are the whole & sole responsibility for everything in your life.
ఇదంతా ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే... ఈ ప్రియనేస్తం మీకొక మంచి నేస్తం, శ్రేయోభిలాషి. అందుకని ఈ విషయంలోనైనా మీరు కొంచెం confused గా ఉన్నట్టయితే, మీ పరిస్థితిని ప్రియనేస్తం కి పంపించండి. ఇక్కడ మీ ప్రశ్నలకి సమాధానాలు పొందండి. ఇక్కడ post చేసిన సందేహంగానీ, పరిస్థితి గురించి కానీ, మన ప్రియనేస్తం చూసే మిత్రులందరూ చదివి వాళ్లకు తోచిన సలహాలు వాళ్లు ఇస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ సమస్య మేము తీర్చేస్తాం..ఎందుకంటే మేము చాలా గొప్పవాళ్ళం కాబట్టి అని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశ్యం. అలాగే ఊరికే సరదా కోసం, కాలక్షేపం కోసం కూడా కాదు. ఒక మంచి నేస్తంలాగా మీ సమస్యని పంచుకుని మీకు కొంచెం సహాయపడడమే ఈ చిన్న ప్రయత్నం. A friend in need in friend in deed కదా మరి..!
ఇదే కాకుండా..ఈ blog లో ఇంకొక మంచి విషయం కూడా ఉంది. మనం జీవితంలో ఎన్ని కోణాలు చూడగలిగితే మనకి అంత అనుభవం వస్తుంది. అంటే..చాలా మంది పరిస్తితులు, సమస్యలు గురించి తెలుసుకోవడం వల్ల ప్రపంచం గురించి, మనుషుల గురించి...ఇలా చాలా చాలా సంగతులు తెలుస్తాయి. మన ఆలోచనా పటిమను, మన విశ్లేషణను, పెంపొందిస్తాయి. ఒక మనిషిగా అన్ని రకాల అనుభవాలు తెలుస్తాయి. మన అనుభవాలనుంచి నేర్చుకునే దాక వేచి ఉండకుండా వేరే వాళ్ల అనుభవాల్లోనుంచి కొంతైనా నేర్చుకోగలిగితే మనం జీవితంలో కొన్నైనా తప్పటడుగులు వేయకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ప్రముఖ తెలుగు నవలారచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు విజయానికి అయిదుమెట్లు పుస్తకంలో అనుకుంటా ఒక సంగతి చెప్పారు. ఏంటంటే ఆయన ఏదో పత్రిక కోసం ఒక శీర్షిక నిర్వహించారట కొన్ని సంవత్సరాలు. అందులో పాఠకులు ఆయన్ని చాలా సందేహాలు అడిగేవాళ్ళు. దానికి ఆయన స్పందించి ఆయన అభిప్రాయాన్ని, సలహాని చెప్పేవారట. అలా ఎంతో మంది పరిస్థితుల్నీ, వాళ్ల ఆలోచనా విధానాల్ని తెలుసుకోవడం వల్ల ఆయనకి మనస్తత్వాన్ని, సమస్యలనీ విశ్లేషించే సామర్ధ్యం ఇంకా మెరుగుపడిందట. అందుకనీ, మనం ఎన్ని ఎక్కువ పరిస్థితుల్ని విశ్లేషించడం వల్ల మన ఆలోచనా పరిధి అంత మెరుగుపడుతుందన్నమాట.
అందుకని మనం కూడా అలాంటి చర్చల్లో పాలుపంచుకుందాం ఈ ప్రియనేస్తంలో..
అయితే ఎవరైనా మీ సొంత సమస్య / ప్రశ్న / పరిస్థితి / సందేహం ఏదయినా సరే ప్రియనేస్తం కి పంపించండి. మీ గురించి కాకపోయినా మీ స్నేహితులు గానీ, మీరు చూసిన ఏదయినా పరిస్థితిని గాని మీరు పంపించవచ్చు మనందరి చర్చ కోసం. ఏదయినా పరిస్థితిని మీరు ఊహిస్తే..ఇలా అయితే ఏమి చెయ్యాలి అని అనుకునేవి..అలాంటివేమైనా ఉన్నా కూడా పంపించండి.
you can ask anything about family, relatives, relationships, friendship, love etc...
Send all your queries to this mail id priyanestham4u@googlemail.com
please mention in your mail if you don't want me to publish your name and details here in the blog. so that, I'll not disclose your name but will post only the question here.
ఎల్లప్పుడూ...మీ...
ప్రియనేస్తం





